రాంచరణ్ (Ram Charan), జూ..ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వ వహించాడు. వరల్డ్ వైడ్‌గా ఈ ఏడాది మార్చి 25న ఆర్ఆర్ఆర్ గ్లోబల్ బాక్సాపీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు చేసి..రికార్డులు సృష్టించింది.
ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఇక థియేటర్లలో సినిమా చూడలేకపోయిన వారు, ఓటీటీ మాధ్యమాలు అందుబాటులో లేని వారి కోసం గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. త్వరలోనే అందరి ఇళ్లలో సందడి చేయనుంది ఆర్ఆర్ఆర్. ఆగస్టు 14న స్టార్ మాలో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కానుంది. అయితే ఏ సమయంలో అనేది ఛానల్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు అదే రోజు రాత్రి 8 గంటలకు ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ జీ సినిమాలో ప్రీమియర్ కానుంది.
సీనియర్ నిర్మాత డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించగా..కొమ్రంభీం పాత్రలో ఎన్టీఆర్ మెరిశాడు. బాలీవుడ్ భామ అలియాభట్ సీత రోల్లో నటించగా..ఉక్రెయిన్ భామ ఒలీవియా మొర్రీస్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.