హైదరాబాద్: జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కలిసిన నటించిన ‘RRR’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. హైదరాబాద్‌లోని ఐదు థియేటర్లలో సినిమా బెనిఫిట్ షోలు వేశారు. దీంతో టాకీసుల వద్ద యంగ్‌టైగర్, మెగాపవర్ స్టార్ అభిమానులు సందడి చేశారు. ప్రేక్షకుల కోలాహలం మధ్య లీడ్‌రోల్ పోషించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్ సినిమా చూశారు. నగరంలోని ఏఎంబీ మాల్లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, భ్రమరాంబ థియేటర్లో రామ్‌చరణ్ దంపతులు సందడి చేశారు.
కాగా, సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం 1500 థియేటర్లలో విడుదలవుతున్నది. జనవరిలోనే ఈ సినిమా విడుదలవాల్సి ఉండగా కరోనా, ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల రేట్లలో గందరగోళం నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే దాదాపు మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరోలు వెండితెరపై కనపించడంతో అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి.