ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 1200కోట్ల వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని నమోదు చేసింది. ఈ సినిమా సీక్వెల్ గురించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ‘బాహుబలి’ తరహాలోనే భారీ స్థాయిలో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు వెలువడ్డాయి. తాజాగా అమెరికా చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై స్పష్టత నిచ్చారు రాజమౌళి. చిత్ర కథా రచయిత, తన తండ్రి విజయేంద్రప్రసాద్ సీక్వెల్ కోసం కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలిపారు. సరైన సమయంలో సీక్వెల్ గురించిన వివరాల్ని వెల్లడిస్తామన్నారు. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్‌బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.