అదే నా కండీషన్!
షూటింగ్ లొకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. భారత్‌లోని కశ్మీర్, కేరళ వంటి ప్రాంతాలు ప్రకృతి రమణీయతకు నెలవని చెప్పారు అగ్ర హీరో రామ్‌చరణ్. ‘ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరువైన ఆయన ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ రంగం తరపున ప్రతినిధిగా పాల్గొంటున్నారు.
షూటింగ్ లొకేషన్స్ కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. భారత్‌లోని కశ్మీర్, కేరళ వంటి ప్రాంతాలు ప్రకృతి రమణీయతకు నెలవని చెప్పారు అగ్ర హీరో రామ్‌చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ ఆడియెన్స్‌కు చేరువైన ఆయన ప్రస్తుతం కశ్మీర్లో జరుగుతున్న జీ20 సదస్సులో భారతీయ సినీ రంగం తరపున ప్రతినిధిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ మాట్లాడుతూ ‘కశ్మీర్ వంటి మనోహరమైన ప్రదేశంలో ఈ సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇండియాలో కూడా విదేశాలతో సరితూగే లొకేషన్స్ ఉన్నాయి. మన భారతదేశ అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆలోచన ఉంది. ఇక నుంచి నా సినిమా షూటింగ్స్ అన్నీ ఎక్కువ శాతం ఇండియాలోనే జరగాలని కోరుకుంటున్నా. కేవలం లొకేషన్ల కోసం విదేశాలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. భవిష్యత్తులో నేను హాలీవుడ్ సినిమాలో భాగమైనా భారత్‌లో మాత్రమే షూటింగ్ జరపాలనే షరతు పెడతాను’ అన్నారు. ప్రస్తుతం దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమలు అనే భేదాలు చెరిగిపోతున్నాయని భారతీయ సినిమా ఏకోన్ముఖంగా ఎదుగుతున్నదని రామ్‌చరణ్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

