ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్'. విక్రమ్ రెడ్డి దర్శకుడు.
హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకుడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న విడుదల కానుంది. శనివారం ట్రైలర్‌ను యువ హీరో శ్రీవిష్ణు విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిదని అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమా ఇది. ఆద్యంతం హాస్య ప్రధానంగా ఆకట్టుకుంటుంది. నేటి యువత మనోభావాలను ఆవిష్కరిస్తుంది’ అన్నారు. అందరూ కొత్తవాళ్లతో చేసిన విభిన్న ప్రయత్నమిదని దర్శకుడు విక్రమ్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ రెడ్డి, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్.ఆర్.ధృవన్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

