ఇటీవల విడుదలైన ‘ఛాంపియన్’ చిత్రంలో చక్కటి పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు యువహీరో రోషన్. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవలే ‘ఛాంపియన్’ చిత్రాన్ని వీక్షించి రోషన్ నటనకు ఫిదా అయ్యారు.
వ్యక్తిగతంగా రోషన్‌ను కలిసి అభినందించడంతో పాటు తమ గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా ఆఫర్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇదిలావుండగా రోషన్‌కు భారీ ఆఫర్లొస్తున్నట్లు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కూడా రోషన్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది.