రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘మోగ్లీ 2025’ సాక్షి మడోల్కర్ కథానాయిక. ‘కలర్‌ఫొటో’ఫేం సందీప్‌రాజ్ దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మాతలు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదలైన తొలిపాట మంచి హిట్ అయ్యిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ సినిమాలోని రెండోపాటను విడుదల చేశారు.
‘ఆ సీతారామ వనవాసాన్ని చూసిన అడవి మనదే..’ అంటూ సాగే ఈ పాటను కల్యాణ చక్రవర్తి రాయగా, కాలభైరవ స్వరపరిచి.. సోని కోమండూరితో కలిసి ఆలపించారు. సీతమ్మను రక్షించేందుకు శ్రీరాముడు యుద్ధానికి వెళ్లినట్టే.. ఇందులో హీరో కూడా తన ప్రేమను కాపాడుకునేందుకు సిద్ధం అవుతున్నాడనే భావనతో ఈ పాట ఆసాంతం సాగింది. కథానాయకుడి తెగువ, దృఢసంకల్పం ఆవిష్కరించేలా పాట పిక్చరైజేషన్ సాగింది. బండి సరోజ్‌కుమార్, హర్ష చెముడు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి ఎం., నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.