డిస్నీప్లస్ హాట్‌స్టార్: ఏప్రిల్ 7
తారాగణం: సౌబిన్ షాహిర్, అనంతరామన్, సిజు, అర్జున్ అశోకన్ తదితరులు
దర్శకత్వం: జీతూ మాధవన్
అనగనగా అని మొదలయ్యే కథల్లో అందరికీ తెలిసింది ఏడుగురు రాజులు చేపల వేటకు వెళ్లిన సందర్భమే! రోమాంచమ్లోనూ ఏడుగురు ఉంటారు. వాళ్లు రాజులు కాదు. పేదలూ కాదు. ఓ మోస్తరు స్నేహబంధం మాత్రం అందరిలోనూ ఉంటుంది. వీళ్లంతా కలిసి బెంగళూరు శివారులో ఓ ఇండిపెండెంట్ ఇంట్లో అద్దెకు ఉంటుంటారు. ఎవరి వ్యాపకాలు వాళ్లవి. ఎవరి బలహీనతలు వాళ్లవి. కాలక్షేపం విషయానికి వస్తే అందరూ ఒక్కటైపోతారు. వీళ్లలో ఒకడు మరో స్నేహితుడి ద్వారా ఆత్మలను పిలిచే ‘ఓయిజా బోర్డు’ గురించి తెలుసుకుంటాడు. ఆటవిడుపుగా ఉంటుందని స్నేహితులను అందరినీ ఒప్పించి ఇంట్లో ఓయిజా బోర్డు ప్రయోగం చేస్తాడు.
మొదట్లో ఏదో ఆటగా సాగిన వ్యవహారం తర్వాత బెడిసి కొడుతుంది. నిజంగానే ‘అనామిక’ అనే ఆత్మ వాళ్ల ఓయిజా బోర్డు మీదికి వస్తుంది. ‘ఆ ఆత్మను ఎలా వదిలించుకోవాలా?’ అని సతమతమవుతున్న తరుణంలో సీన్లోకి సీను అనే పాత్ర ప్రవేశిస్తుంది. అతని వింత ప్రవర్తనతో ఏడుగురు మిత్రులూ అనుక్షణం చస్తూ బతుకుతుంటారు. ఇంతకీ అనామిక ఎవరు? దానివల్ల ఈ స్నేహితులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నది మిగిలిన కథ! కామెడీ హారర్‌గా రూపొందించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. మలయాళం మాతృకకు తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉంది. పేరుకు తగ్గట్టు రోమాంచిత సన్నివేశాలు లేకపోయినా.. మనసారా నవ్వుకునే ఘట్టాలకు కొదవలేదు.