నాగార్జున పల్లా, ఆద్యారెడ్డి, భావన నీలిపి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రోలుగుంట సూరి’. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సౌమ్య చాందిని పల్లా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు.
గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న రియలిస్టిక్ డ్రామా ఇదని, జీవిత సత్యాలను తెలియజేస్తూ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. గ్రామీణ జీవనశైలి, భావోద్వేగాలను వాస్తవ కోణంలో ఆవిష్కరిస్తున్నామని నిర్మాత సౌమ్య చాందిని తెలిపారు. ఈ చిత్రానికి కథ, సంభాషణలు: మహ్మద్ సాయి, సంగీతం: సుభాష్ ఆనంద్, దర్శకత్వం: అనిల్ కుమార్ పల్లా.