హీరో నితిన్ నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘రాబిన్‌హుడ్’. శ్రీలీల కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ప్రత్యేక అతిథి పాత్ర పోషించటం విశేషం. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాలోని డేవిడ్ వార్నర్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. షార్ట్ హెయిర్ కట్‌తో ట్రెండీ దుస్తులు ధరించి, ఫుల్స్వాగ్తో డేవిడ్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న డేవిడ్ వార్నర్ ప్రజెన్స్ ఈ సినిమాపై గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు.
త్వరలోనే సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నామని, అలాగే ప్రమోషనల్ టూర్‌ని కూడా నిర్వహించనున్నామని వారు తెలిపారు. డా.రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, కేతిక శర్మ, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.