The 100 | కోల్ సిటీ, జూలై 10: మొగిలి రేకులు సీరియల్‌తో తెలుగు ప్రజలను మెప్పించి చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసి సినీ నటుడుగా రాణిస్తున్న పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఆర్కే సాగర్ తాజాగా నటించిన మరో సినిమా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విడుదల కాబోతుండటంతో ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. పూర్తి యాక్షన్ మూవీగా వస్తున్న ది 100 సినిమాలో ఈ సారి ఐపీఎస్ పాత్రలో సాగర్ నటించాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సాగర్ నటించిన నాలుగో చిత్రం ఇది.
రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో వస్తున్న ది- 100 సినిమాలో మరో విశేషం కూడా ఉంది. ఇదే సినిమాలో గోదావరిఖనికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ కూచిపూడి నృత్య కళాకారిణి గుమ్మడి ఉజ్వల ఒక శాస్త్రీయ నృత్యంతో కూడిన పాటకు కొరియోగ్రఫర్‌గా అవకాశం దక్కించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కాబోతున్నది 100 సినిమాలో గోదావరిఖనికి చెందిన సినీ నటుడు ఆర్కే సాగర్ హీరోగా నటించడం, ఇదే సినిమాలో స్థానిక కళాకారిణి ఉజ్వల ఒక పాటకు కొరియోగ్రాఫర్‌గా పని చేయడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది.
ఇటీవలే హైదరాబాద్‌లో ఫ్రీ రిలీజ్ షోను రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డిలు విడుదల చేశారు. శుక్రవారం గోదావరిఖనిలోని న్యూ అశోక థియేటర్లో విడుదల కాబోతున్న సినిమాను అభిమానులు ఆదరించి మంచి విజయం అందించాలని సినీ అభిమానుల ఐక్య వేదిక సంఘం పెద్దపల్లి జిల్లా చైర్మన్ గుండేటి రాజేష్ అభిమానులను కోరారు. ఈ ప్రాంతానికి చెందిన సినీ నటుడు సాగర్ నటించిన ది-100 సినిమా తప్పకుండా మంచి హిట్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు .
Peddapalli | అంతర్గాంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం
Dasari Manohar Reddy | మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
Huzurabad | పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.. 11 మంది అరెస్ట్