కమెడియన్ సత్య కథానాయకుడిగా సినిమా రూపొందుతున్నది. ‘మత్తువదలరా’ ఫ్రాంచైజీ ఫేం రితేష్ రాణా దర్శకుడు. ‘మిస్ యూనివర్స్ ఇండియా’ రియా సింఘా కథానాయిక. చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లునిర్మాతలు. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పకులు.
ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ‘మత్తువదలరా’లో కీలక పాత్రలు పోషించిన వెన్నెల కిశోర్, అజయ్ ఇందులోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు ‘మత్తువదలరా’ టీమే ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. ఆద్యంతం నవ్వులతో, ఊహించని మలుపులతో.. వికృతమైన చమత్కార ప్రయాణంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో మొదలుకానున్న ఈ చిత్రానికి కెమెరా: సురేశ్ సారంగం, సంగీతం: కాలభైరవ.