Chatrapathi Shivaji | వెండితెరపై మహారాష్ట్ర పోరాటయోధుడు ఛత్రపతి శివాజీ వీరగాధ
మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రితీష్ దేశ్‌ముఖ్.. ‘వేద్' సినిమాతో దర్శకుడిగా కూడా అలరించాడు. 15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మరాఠీ సినిమా, దాదాపు 75కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది.
Chatrapathi Shivaji | మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రితీష్ దేశ్‌ముఖ్.. ‘వేద్’ సినిమాతో దర్శకుడిగా కూడా అలరించాడు. 15కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మరాఠీ సినిమా, దాదాపు 75కోట్లు వసూలు చేసి ఘన విజయాన్ని అందుకుంది. అదే ఊపులో దర్శకుడిగా భారీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టాడు రితీష్. మహారాష్ట్ర పోరాటయోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది.
జీయో స్టూడియోస్, ముంబయి ఫిల్మ్ కంపెనీ కలిసి మరాఠా, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సందర్భంగా రితీష్ ఈ సినిమా గురించి మాట్లాడారు. ‘శివాజీ అంటే వ్యక్తి కాదు. భారతీయ సంస్కృతి. జన హృదయాల్లో స్వరాజ్యజ్యోతిని వెలిగించిన పోరాటయోధుడు. ఆయన శౌర్యపరాక్రమాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి జనరేషన్‌కి ఉంది.
శివాజీ తిరుగుబాటుదారుడు కాదు. ఆదర్శవాది. ఛత్రపతిగా ఎదిగిన మహోన్నత శక్తి. ఆ మహనీయుడి చరిత్రతో వెండితెరను పునీతం చేయాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు రితీష్ దేశ్‌ముఖ్. ఇది ఊహించి రాసే చరిత్ర కాదని, పూర్తి వివరాలు తెలుసుకొని బాధ్యతాయుతంగా తెరకెక్కించాలనుకుంటున్నామని జెనీలియా చెప్పారు. ఇందులో శివాజీగా రితీషే నటిస్తాడా? లేక వేరొకరు నటిస్తారా? అనేది తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

