– ఎన్. చందర్, జనగామ.
ఇంటిలోకి వచ్చేలా భూమిపూజ జరిగితే చాలు. తప్పనిసరిగా ‘పిల్లర్’కు అనికాదు. ఈశాన్యం.. ఈశ్వర స్థానం. అది గృహంలోని డ్రాయింగ్ రూమ్ కూడా అవుతుంది. కొన్ని పర్యాయాలు ఆలోచనలు మారి, ఇంటి విస్తీర్ణం పెంచాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని గదులు తగ్గుతాయి. ఏది ఏమైనా.. నిర్దుష్ట కొలతలతో గృహం ఉచ్ఛమైన భాగంలో పూజ జరగాలి. అలాగని ముందుగానే అన్నీ సరిగ్గా ప్లాన్ చేసి పెట్టుకొని.. నక్ష నిర్ణయం జరిగాక ‘ఈశాన్యం’ పిల్లర్ గుంతలోనే సరిగ్గా పూజ చేసుకోవచ్చు. వద్దు అనికాదు. అంతేకానీ, ఇంటి పిల్లర్కే అనే విధానం కూడా కాదు. మంత్రబద్ధంగా, సమయానుకూలంగా, శాస్ర్తోక్తంగా ఇంటి స్థానంలో పూజ జరపడం చాలా ముఖ్యం.
– కె.ఎల్. మహేశ్, తార్నాక.
ఇంటికి సెప్టింక్ ట్యాంక్ తూర్పు మధ్యలో లేదా ఇంటి ఉత్తరం మధ్యలో పెట్టవచ్చు. ముఖ్యంగా, మరుగుదొడ్ల నిర్మాణం ఉచ్ఛమైన ఉత్తరంలో కానీ, తూర్పులో కానీ కట్టవద్దు. అలాగే, ఇంటికి ఈశాన్య భాగంలో కూడా లెట్రిన్లు నిర్మించకూడదు.

ఇంటి ప్రహరీ లోపల టాయిలెట్ వసతి అవసరం అనుకున్నప్పుడు ఇంటికి ఆగ్నేయ భాగంలో లేదా వాయవ్య భాగంలో ఇంటిని-కాంపౌడ్ను అంటకుండా కట్టుకోండి. మీ ఏరియాలో డ్రైనేజ్ వసతి ఉంటుంది కదా! సెప్టిక్ ట్యాంక్ అవసరం ఎందుకు? సరే, మీ కారణం ఏదైనా.. గొయ్యిమీద టాయిలెట్ కట్టకూడదు. గొయ్యి-లెట్రిన్ గది దూరంగా ఉండాలి. గొయ్యి మాత్రం ఆ రెండు దిశల్లోనే ఉండాలి. మిగతా దిశలు పనికిరావు.
– ఆర్. జగదీశ్, కొడగండ్ల.
కొన్ని సందర్భాల్లో కొత్త పడక గదులు, టాయిలెట్లు అవసరం అవుతాయి. అప్పుడు ఇంటిలోని ఖాళీ స్థలాలను బట్టి నిర్మాణాలు చేపడతారు. అలాగని ఉన్న స్థలం ఏదైనా.. దేనికి పడితే దానికి వాడకూడదు కదా! ఉచితానుచితాలు ఉంటాయి. ఈశాన్యం స్థలం ఉంటుంది. అలాగని ఆ చోట టాయిలెట్ నిర్మాణం చేయలేం.

వాయవ్యం బెడ్రూమ్కు, ఉత్తరంలోని ఖాళీ భాగాన్ని కలుపుకొని టాయిలెట్ కడతారు. ఇంట్లో స్థలం ఉండదని కాదు.. కానీ, దేనిని దేనికి వాడాలి, వాడకూడదు అనేది మనం కాదు నిర్ణయించేది.. శాస్త్రం. మీరు ఏం మార్పులు చేశారు లేదా చేయాలని అనుకుంటున్నారో.. అన్నీ తెలిసిన వారికి చూపించి, నిర్ణయం తీసుకోండి. పెరుగును కూడా వంటలో వాడతారు. అందుకని.. పప్పు-చారులో వాడము కదా! ఇదీ అంతే!
– ఎ. శంకర్, గజ్వేల్.
ఒకసారి పంపకం జరిగినాక ఆ స్థానం ఆ పెద్దవాళ్లదే అవుతుంది. ఆ ఇంట్లో జరిగే పరిణామాలకు మీకు సంబంధం ఉండదు. వారి ఇల్లు, వారి సంసారం.. ఎవరి ప్రాబ్లమ్స్ వారివి. మీ అన్నగారి తర్వాత వారి పిల్లలు ఉంటారు. అలా వారికే చెందుతుంది. ఏదేమైనా ఆ కుటుంబం మీకన్నా పెద్దదే కదా! ఇవన్నీ ఆలోచించకుండా ముందు మీ అన్నగారి అకాల మరణానికి, ఆ ఇంటి నిర్మాణానికి ఏదైనా బలమైన నిర్మాణలోపం కారణంగా ఉందో చూడండి.

ఎందుకంటే, మీ అన్న పిల్లలు అయినా అందులో ఆనందంగా కొనసాగాలి కదా ముందుముందు. పెద్దవారు బతికి ఉంటేనే పైభాగంలో ఉండాలి అనే విషయం శాస్త్ర సంబంధం కాదు. ఉన్న ఇల్లు ఎవరిదైనా.. జరిగే సంఘటనలకు ఇంటి దోషాలు లేకుండా చూసుకొని జాగ్రత్త పడటం అవసరం. నాకు తెలిసి ఆ ఇంటికి నైరుతి-ఈశాన్య దోషాలు ఉన్నయేమో చూసి సరిచేసుకోండి. శుభం!
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143