ఎన్టీఆర్ కథానాయకుడిగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. తన సినిమాల్లో కథానాయకుల్ని అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ రోమాంచితమైన ఎలివేషన్స్‌తో ప్రజెంట్ చేస్తుంటారు దర్శకుడు ప్రశాంత్‌నీల్. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్‌ను నెవర్సీన్ బిఫోర్ అనుకునేలా చూపించబోతున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ సినిమాలో వివిధ భాషల అగ్ర తారలు కీలక పాత్రల్లో నటించనున్నారని వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ‘కాంతార’ ఫేమ్ రిషబ్‌శెట్టి కీలకమైన అతిథి పాత్రలో కనిపిస్తారని తెలిసింది. ఇప్పటికే ఆయనతో చర్చలు పూర్తయ్యాయని, ‘డ్రాగన్’లో భాగమయ్యేందుకు రిషబ్‌శెట్టి సంతోషంగా అంగీకరించారని సమాచారం. వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్-రిషబ్శెట్టిల మధ్య చక్కటి స్నేహసంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’లో రిషబ్‌శెట్టి నటించడం ఖాయమనే వార్తలకు మరింతగా బలం చేకూరుతున్నది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకానుంది.