Kantara Chapter 1 | శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాంతార ప్రీక్వెల్ ప్రాజెక్ట్ కాంతార చాప్టర్ 1. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ క్రియేట్ చేస్తోంది.
కాంతారా చాప్టర్ 1లో రిషబ్ శెట్టి మరోసారి స్టన్నింగ్ యాక్టింగ్‌తో బాక్సాఫీస్‌ను అదరగొట్టేస్తున్నాడు. గ్రిప్పింగ్ కంటెంట్‌తో వచ్చి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. ఈ మూవీకి క్రేజ్ ఎలా ఉందో చెప్పే వార్త ఒకటి షేర్ చేశారు మేకర్స్. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలో ఇప్పటివరకు 50 లక్షల కాంతారా చాప్టర్ 1 టికెట్లు అమ్ముడుపోయాయని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక గత 24 గంటల్లోమిలియన్కుపై టికెట్లు బుకింగ్ అయ్యాయంటే కాంతార మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టికెట్ సేల్స్ వరుసగా నాలుగోరోజు మిలియన్ మార్క్ దాటడం విశేషం. ఈ క్రేజ్‌తో ఇక సోమవారం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో కాంతార ఫీవర్ ఎలా ఉండబోతుందనేది చూడాలి. భారీ బడ్జెట్‌తో డివైన్, మిథికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. జయరామ్, ప్రమోద్ శెట్టి, ప్రకాశ్ తుమినాడ్ , గుల్షన్ దేవయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు.
#KantaraChapter1 #KantaraEverywhere 💯❤️🏆🔥🔥 pic.twitter.com/M2qV65OTRH
— BA Raju’s Team (@baraju_SuperHit) October 5, 2025
Kayadu Lohar | ఆ సినిమాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. తెలుగు మూవీపై కయాదు లోహర్