టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy). టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా శ్యామ్‌సింగరాయ్ నుంచి తొలి సాంగ్ Rise Of Shyam ప్రోమోను విడుదల చేశారు. 1970 కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో ఈ పాట ఉండబోతున్నట్టు ప్రోమో ద్వారా తెలిసిపోతుంది. పొడవాటి కళ్లద్దాలతో నోటిలో సిగరెట్‌తో సంప్రదాయ బెంగాలీ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నాడు నాని.
కృష్ణకాంత్ రాసిన ఈ పాటను మిక్కీ జే మేయర్ విశాల్ కంపోజ్ చేయగా..విశాల్ దడ్లానీ, అనురాగ్ కులకర్ణి, సిజ్జీ పాడారు. శ్యామ్ సింగరాయ్..అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే శ్యామ్‌సింగరాయ్..అరే తిరగబడ్డ సంగ్రామం వాడే. అరే వెనుకబడని చైతన్యం వాడే..అంటూ సాగే సాంగ్ సినిమా కథతో ట్రావెల్ చేయనున్నట్టు ప్రోమో తెలియజేస్తుంది.
నిహారిక ఎంటర్టైన్ మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది. డిసెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Keerthy Suresh Selfie | అందాల తారలతో కీర్తిసురేశ్ సెల్ఫీ
Rajasekhar Sankranthi race | సంక్రాంతి రేసులో రాజ ‘శేఖర్’..?
Samantha: సమంత బాలీవుడ్ సినిమాలపై ఆసక్తి చూపడానికి ఆ హీరోయిన్ కారణమా?
Tamannah In Bhola Shankar | భోళా శంకర్‌లో తమన్నా..తాజా అప్డేట్