RGV Vyooham Movie Trailer | ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో దర్శకుడు ఆర్జీవి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్నికల ఓటమి తర్వాత సీనియర్ ఎన్టీఆర్ జీవితం ఎలా మారింది. ఆయన జీవితంలోకి పార్వతి ఎలా వచ్చింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే కాంట్రవర్సీయల్ సబ్జెక్ట్‌తో పెద్ద దుమారమే రేపాడు. ఈ సినిమా రిలీజ్ టైమ్‌లో ఏపిలోని చాలా చోట్ల ఈ మూవీ ప్రదర్శననే నిలిపివేశారు. ఇక ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అంటూ మరో కాంట్రవర్సీయల్ సినిమా తీసి చాలా మందికి టార్గెట్ అయ్యాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో ‘వ్యూహం’ అనే సినిమాతో ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పెంచడానికి వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఆర్జీవి విడుదల చేసిన ముఖ్య పాత్రల ఫోటోలు నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
YSR హెలికాఫ్టర్ ప్రమాదం, YSR మరణించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ఈ సినిమా స్టోరీగా తెలుస్తుండగా.. సోనియా గాంధీ పాత్రతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. జగన్ పాత్ర పోషించిన వ్యక్తికి సోనియా ఫోన్ చేసి ఓదార్పు యాత్ర ఆపేయాలని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు చంద్రబాబు పాత్ర ఎంటర్ అవుతాడు. ఇక ఇందులో జగన్, భారతి, జగన్ కుటుంబ పాత్రలతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇలా అనేకమంది పాత్రలని చూపించాడు ఆర్జీవీ. ఇక ఈ ట్రైలర్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై, జగన్ పై చెప్పిన డైలాగ్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ట్రైలర్ చూస్తుంటే పెద్ద సంచలనం సృష్టించే విధంగా అనిపిస్తుంది. వంగవీటి సినిమాను నిర్మించిన దాసరి కిరణ్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా తెరకెక్కింది. అందులో వ్యూహం తొలిపార్టు కాగా, రెండోది శపథం. తొలిపార్టులో YSR మరణం తర్వాత ఏం జరిగిందని, రెండో పార్ట్‌లో జగన్ ఎలా సీఎం అయ్యాడు అనేది ఆర్జీవి చూపించబోతున్నాడు.
Here is VYOOHAM trailer https://t.co/3CVFnMzHBY #VyoohamTrailer
— Ram Gopal Varma (@RGVzoomin) October 13, 2023