రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎప్పుడు ఏ సినిమా చేస్తడో..ఏ సినిమా రిలీజ్ చేస్తడో చెప్పడం కష్టమే. వర్మ ఒక సినిమా వస్తుందనే లోపే మరో సినిమా అప్డేట్ ఇచ్చి షాక్‌కు గురిచేస్తుంటాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ హాలీవుడ్ స్టార్ బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ స్ఫూర్తితో తెరకెక్కిస్తున్న చిత్రం లడ్కీ, ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ (Ladki Enter The Girl Dragon). పూజా భలేకర్ (Pooja Bhalekar) ప్రధాన పాత్రలో ఇండియాలోనే మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ సినిమాగా వస్తున్న చిత్ర ట్రైలర్‌ను ఇవాళ చైనా టీంతో కలిసి లాంఛ్ చేయబోతున్నాడు వర్మ.
ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు వర్మ. నేను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన, ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఖరీదైన చిత్రం. ట్రైలర్‌ను సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నాం. ఇండో-చైనీస్ కో ప్రొడక్షన్స్ లో ఆర్ట్సీ మీడియా, చైనీస్ ప్రొడక్షన్ మేజర్ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్ స్తున్న ఈ చిత్రాన్ని ముంబై, గోవా, చైనాలో చిత్రీకరించాం అంటూ అప్ డేట్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు ఆర్జీవీ.
లడ్కీ చైనాలో విడుదల కాబోతున్న తొలి భారతీయ చిత్రంగా నిలువనుంది. ఈ చిత్రాన్ని మార్షల్ ఆర్ట్స్ హీరో బ్రూస్ లీకి అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు ఆర్జీవి.
పూజా భలేకర్ ట్రైనింగ్ సెషన్ వీడియో…
Here is a clip of @PoojaBofficial training for a shoot of LADKI India’s 1st realistic martial arts film Trailer release @5 pm pic.twitter.com/EzuHXGzf8K
— Ram Gopal Varma (@RGVzoomin) November 8, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా