సినీ ఇండస్ట్రీలో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అభిమానులంతా ఆర్జీవీగా పిలుచుకునే ఈ ట్యాలెంటెడ్ దర్శకుడు.. సమాజంలోని పలు అంశాలపై తనదైన పంథాలో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేశాన్ని ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతున్న తరుణంలో ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ఒమిక్రాన్ భయంతో ప్రజలను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచ దేశాలు మొత్తుకుంటున్నాయి. పలుదేశాల్లో ఒమిక్రాన్‌ను నియంత్రించేందుకు బూస్టర్ డోసులు కూడా వేస్తున్నారు. అయితే భారత్‌లో ఇప్పటికీ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోని ప్రజల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో దేశ, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్జీవీ ఒక వింత సలహా ఇచ్చాడు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు వచ్చే అభిమానులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ చూపిస్తేనే.. థియేటర్లోకి అనుమతించాలని ఆర్జీవీ చెప్పాడు.
ఇలా చేస్తే ప్రజలంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని సినిమాకు వస్తారన్నాడు. ‘థియేటర్లో ఆర్ఆర్ఆర్ చూడాలనే కోరిక.. వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యాన్ని ఓడిస్తుంది’ అని ఆర్జీవీ వివరించాడు. ఈ ట్వీట్ చూసిన పలువురు.. నిజంగానే ఇది మంచి ఆలోచన అంటున్నారు.
I have a GREAT idea for the GOVERNMENT regarding OMICRON😎😎😎…They should not allow anyone into #RRR theatres unless they show proof of DOUBLE DOSE ..The DESIRE to see #RRR will CONQUER the CARELESSNESS of the PEOPLE 💪💪💪
— Ram Gopal Varma (@RGVzoomin) December 25, 2021