RGV Aasha encounter | రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఆయన వర్క్‌పై ఇప్పటికీ ఫ్యాన్స్ మాత్రం నమ్మకంగానే కనిపిస్తుంటారు. పైగా ఆయన తీసుకునే కథలు అలా ఉంటాయి. ఇప్పుడు కూడా దిశా ఎన్కౌంటర్ ఆధారంగా ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయి కూడా చాలా రోజులైంది. ఎన్నో కేసులను, కోర్టులను దాటుకుని జనవరి 1న ఆశా ఎన్కౌంటర్ విడుదల కానుంది. శ్రీకాంత్ అయ్యంగార్, సోనియా అకుల, వెంకట్, శ్రీధర్, ముని, నవీన్, కళ్యాణ్, ప్రవీణ్, ప్రశాంతి నటీనటులుగా ఆనంద్ చంద్ర రచన, దర్శకత్వంలో అనురాగ్ కంచర్ల నిర్మిస్తున్న చిత్రం ఆశా ..ఎన్ కౌంటర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిత్ర రచయిత & దర్శకుడు ఆనంద్ చంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఆర్జీవీ చాలా విషయాలు చెప్పారు. జరిగిన అనేక వాస్తవ కథనాలతో ఈ సినిమా చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నాము. టెక్నీషియన్లకు ఈ సినిమా విడుదలైన తర్వాత చాలా మంచి పేరు వస్తుంది అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ (RGV) మాట్లాడుతూ.. ఆశా ఎన్కౌంటర్ జరగడానికి కారకులు ఎవరు? అనేది ఈ చిత్రంలో దర్శకుడు చాలా బాగా చూపించాడు. మర్డర్ మూవీతో తను ఎంతో మంచి దర్శకుడు అనిపించిన ఆనంద్ చంద్ర ఈ సినిమా ద్వారా మరో మెట్టు పైకి ఎదుగుతాడు అని అన్నారు..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Pushpa | పుష్ప ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ఎంత వచ్చాయంటే..
మంత్రులు మీ లగ్జరీని తగ్గించుకోండి : సినీ హీరో సిద్ధార్థ ట్వీట్
Shyam Singha Roy సినిమా రివ్యూ
Anil kumar yadav | ‘నాకు కొడాలి నాని తప్ప ఏ నానీ తెలియదు’.. ఏపీ మంత్రి కౌంటర్
Chiranjeevi | ఆన్గెపుకాయలు పండించిన చిరంజీవి.. రైతుల గురించి ఏమన్నాడంటే..