CM Vijay | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమైన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘సిగ్మా’ (Sigma) అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ అంచనాల మధ్య విడుదలయింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచి మంచి టాక్‌తో నడుస్తుంది.
అయితే ఈ సినిమా విజయంపై ముఖ్యమంత్రి విజయ్ తన కుమారుడికి ప్రత్యేక రీతిలో మద్దతు తెలిపారు. మధురాంతకంలో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న ఆయన, పార్టీ వాలంటీర్ అందించిన జేసన్ సంజయ్ ‘సిగ్మా’ సినిమా ఫ్రేమ్డ్ ఫోటోను తలకెత్తుకుని గర్వంగా ప్రదర్శించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు సినిమా మొదటి రోజు మొదటి షో కోసం విజయ్ సతీమణి సంగీత సోర్నాలీంగం, కుమార్తె దివ్య సాషా చెన్నైలోని కమలా థియేటర్‌కు చేరుకుని ప్రేక్షకులతో కలిసి సినిమా వీక్షించారు. దివ్య సాషా బ్లాక్ ‘సిగ్మా’ టీషర్ట్ ధరించి తన అన్నకు సపోర్ట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు ఎన్నికల ప్రచార సభలు మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ, సీఎంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన విజయ్, తన తనయుడి తొలి సినిమా విడుదలను ఇలా వినూత్న రీతిలో ప్రోత్సహించారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించగా, లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు.