మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం అతని కిట్టీలో పదికి పనే ప్రాజెక్టులు ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమా రిపబ్లిక్ కి కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.అక్టోబర్ 1న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. తాజాగా సినిమా నుండో జోర్ సే సాంగ్ రిలీజ్ చేశారు.
జోర్ సే సాంగ్ మంచి మసాలా సాంగ్‌గా తెరకెక్కనుండగా, ఈ సాంగ్‌కు మణిశర్మ తనదైన శైలిలో బాణీలు అందించారు. ఈ లిరికల్ సాంగ్‌కి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, సాకీ శ్రీనివాస్, బరిమిశెట్టి ఆలపించారు. ఈ సాంగ్‌కి సాయి ధరమ్ తేజ్ అదిరిపోయేలా డ్యాన్స్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ తనకెంతో స్పెషల్ అంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు సాయి తేజ్ . చాలా రోజుల తర్వాత ఈ పాటలో హార్ట్‌ఫుల్ డాన్స్ చేశానని, ఇది మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.
జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ పతాకాలపై భారీ రేంజ్లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. సీఎం పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించనుండటం విశేషం. చిత్రంలో పంజా అభిరామ్ అనే జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నాడు సాయి ధరమ్. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించారు.