Renu Desai | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. ప్రత్యేకించి ఆమె రెండో పెళ్లి గురించి వచ్చిన రూమర్స్ నెట్టింట తెగ హాట్ టాపిక్‌గా మారాయి. 2009లో పవన్ కల్యాణ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న రేణు దేశాయ్, అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. 2012లో వీరి వివాహ బంధానికి బీటలు వారాయి.. విడాకుల అనంతరం రేణు సినిమాలకు కూడా దూరమయ్యారు. అప్పటినుంచి తల్లిగా తన పాత్రను పోషిస్తూ పిల్లలకే ప్రత్యేక సమయం కేటాయించారు.
పవన్ అభిమానులు ఇప్పటికీ ఆమెను తమ వదినగానే భావిస్తుంటారు. రేణూ రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఆమెని తెగ ట్రోల్ చేస్తుంటారు. ఈ సందర్భాలలో రేణూ దేశాయ్ కూడా గట్టిగా రియాక్ట్ అవుతుంటుంది. అయితే రేణూ దేశాయ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంటుంది. రేణూ దేశాయ్ తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో కూతురు ఆద్యతో దిగిన పిక్ షేర్ చేస్తూ.. సర్జరీ తర్వాత నా ముద్దుల కూతురితో కలిసి డిన్నర్ డేట్‌కి బయటకు వెళ్లాను అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ తర్వాత రేణూ దేశాయ్‌కి సర్జరీ జరగడమేంటి, ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ఇక రేణూ దేశాయ్ దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో నటించారు. హేమలత లవణం పాత్రలో కనిపించినా.. ఆ సినిమా ఫెయిల్ కావడంతో ఆమె మళ్లీ సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. రేణు దేశాయ్ ఇప్పుడు జంతు హక్కుల కోసం పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్తగా మారారు. మూగజీవాల సంక్షేమానికి సొంతగా ఎన్జీవో కూడా ప్రారంభించారు. ఈ సంస్థకు ఉపాసన కొణిదెల అంబులెన్స్ సదుపాయం అందించడం విశేషం. ఇక ఇదిలా ఉంటే రేణ ఇటీవల రెండో పెళ్లిపై ఓపెన్ అయింది. అకీరా, ఆద్యే నన్ను పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు. నువ్వు ఎవరితో హ్యాపీగా ఉంటావో వాళ్లని పెళ్లి చేసుకో అంటున్నారు. మరో రెండేళ్లో నా పిల్లలకి పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు తప్పకుండా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని పేర్కొంది రేణూ.