Renu Desai | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తాజాగా ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఇదే క్రమంలో తనయుడు అకిరా నందన్, పవన్ కళ్యాణ్ తో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళిన విషయం గురించి మాట్లాడుతూ.. ఈ మధ్య అకీరాకి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కలిగింది.ఆలయాలని ఎక్కువగా సందర్శిస్తున్నారు.పవన్ కళ్యాణ్ కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ వెళ్తున్నట్టు అకీరా నాతో చెప్పాడు. అప్పుడు నువ్వు కూడా నాన్నతో కలిసి వెళ్లు నీ ప్రయాణం సాఫీగా ఉంటుందని చెప్పాను.
ఇటీవల తమిళనాడు,కేరళ లో వివిధ ఆలయాలకు పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో అకిరా వెళ్తాను అంటే.. సరే అని చెప్పాను. అందుకు కారణం పవన్ కళ్యాణ్ మంచి తండ్రి. తన పిల్లలను ఎంతో ప్రేమగా కేరింగ్ గా చూసుకుంటారు. అందుకే తన తండ్రి దగ్గరకి వెళతానంటే నేను ఎప్పుడు నో చెప్పలేదు. వెళ్లమనే చెబుతాను అని పవన్ కళ్యాణ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. తండ్రి పిల్లలు ఎప్పుడూ కలిసి ఉండాలని నేను కోరుకుంటాను. ఆయనతో పిల్లలు కలవడం తనకు ఓకే చెప్పింది రేణు. ఇక తన జాతకంలో రాజకీయాలలోకి ఎంట్రీ ఉందని, తనకు బీజేపీ అంటే ఇష్టం అంటే కనుక ఎప్పుడైన రాజకీయాలలో అడుగుపెట్టాలని అనుకుంటే బీజేపీలో జాయిన్ అవుతానని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇటీవల రేణూ దేశాయ్ హెచ్‌సీయూ ఇష్యూ మీద కూడా మాట్లాడింది. అయితే ఆ సమయంలో చాలా మంది నన్ను తిట్టారు. ఒకప్పుడు హైదరాబాద్ అంతా చెట్లే ఉన్నాయి. అవి కొట్టేసి బిల్డింగ్స్ కట్టలేదా అని అడుగుతున్నారు. అప్పుడు మనకు తెలీదు. ఒకప్పుడు జరిగింది, మనం ఇకపై జరగకుండా చూసుకోవాలి కదా. ఇలాగే చెట్లు కొట్టుకుంటూ పోతే ఇంకా వేడి పెరుగుతుంది. మనకు తెలిసిన తర్వాత కూడా ఏమి చేయలేదంటే అది మన తప్పే అవుతుంది. ముందు చేసారు కదా అని ఇప్పుడు చేయకూడదు. 400 ఎకరాలు నాశనం చేస్తున్నారు, ఆక్సిజన్ ఎక్కడ్నుంచి వస్తుంది అని ఆలోచించాలి కదా అని తెలిపినట్టు రేణూ దేశాయ్ పేర్కొంది.