Renu Desai | పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎప్పుడు హాట్ టాపిక్‌గానే మారుతూ ఉంటుంది. పవన్ వనుండి విడిపోయిన తర్వాత రేణూ దేశాయ్ మరో పెళ్లి చేసుకోకుండా, తన పిల్లలైన అకీరా నందన్ మరియు ఆధ్యాలతో ఒంటరిగా జీవితం కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి స్పష్టత ఇచ్చింది. తాను ఎందుకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలిపింది.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణు దేశాయ్, రెండో పెళ్లి చేసుకోవడానికి తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని, కానీ మరికొన్ని సంవత్సరాల పాటు వెయిట్ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
రెండు మూడేళ్లలో పెళ్లి చేసుకుంటా. నా జీవితంలో కూడా ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని స్పష్టత ఇచ్చింది. పిల్లల కోసమే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు . నన్ను మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చినా, అప్పట్లో పిల్లలు చిన్నవారు కావడంతో వాళ్లను వదిలి కొత్త జీవితం ప్రారంభించడం సబబు కాదు అనిపించింది. వాళ్లకి తండ్రి దూరంగా ఉన్నాడు. నేనూ దూరమైతే వాళ్లు ఒంటరితనంతో బాధపడతారు అనిపించింది అని రేణు భావోద్వేగంగా వివరించారు. అకీరా, ఆద్య కూడా నన్ను మ్యారేజ్ చేసుకోమంటున్నారు. తన పిల్లలు కూడా మద్దతుగా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు రేణూ.
నా పెళ్లి గురించి పిల్లలు చాలా పాజిటివ్‌గా ఉన్నారు. మమ్మీ, నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో వాళ్లని పెళ్లి చేసుకో అని చెప్పడం నాకు ధైర్యం ఇచ్చింది. వాళ్లే నన్ను మ్యారేజ్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నారు అని రేణూ పేర్కొంది. మరికొన్ని సంవత్సరాల తర్వాత మాత్రమే నాకు పూర్తిగా స్వేచ్ఛ వస్తుంది, అప్పుడు నా జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు.పిల్లలు కాలేజ్‌కి వెళ్తే వాళ్లకి కొత్త ప్రపంచం ప్రారంభమవుతుంది. అప్పుడూ అంతగా తల్లిదండ్రులపై డిపెండెంట్‌గా ఉండరు. అప్పుడు నేను కూడా నా జీవితాన్ని ఆనందించగలుగుతాను అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్. కాగా, రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌తో బద్రి సినిమాలో కలిసి నటించినప్పుడు ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు.