Utsavam | దిలీప్ ప్రకాశ్, రెజీనా లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ఉత్సవం’ (Utsavam). అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్బీ శ్రీరాం, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
థియేటర్, సురభి నాటకాల ఆవశ్యకతను తెలియజేసే నేటి తరానికి కనెక్ట్ అయ్యే స్టోరీలైన్‌తో సాగే ఈ చిత్రం భావోద్వేగాలు, యూత్‌ఫుల్ ప్రేమ కథాంశంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ మూవీ అక్టోబర్ 11న పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలో ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
హార్న్ బిల్ పిక్చర్స్‌పై సురేశ్ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇంకేంటి మరి ఓటీటీలో ఉత్సవంపై మీరూ ఓ లుక్కేయండి.
Telugu film #Utsavam is streaming now on AMAZON PRIME. pic.twitter.com/k0aAJhwuCh
— Christopher Kanagaraj (@Chrissuccess) October 11, 2024
Ka | కిరణ్ అబ్బవరం స్టన్నింగ్ లుక్.. క విడుదలయ్యేది అప్పుడే
Kanguva | సూర్య కంగువ తెలుగు, తమిళం ఆడియో లాంచ్.. ముఖ్య అతిథులు వీళ్లే..!