‘ఆర్ఆర్ఆర్’ చిత్ర అపూర్వ విజయంతో మంచి జోష్‌మీదున్న అగ్రహీరో రామ్‌చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాల్ని అంగీకరిస్తున్నారు. తాజాగా ఆయన నటించబోయే 17వ చిత్రానికి సంబంధించిన వార్తొకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కన్నడ దర్శకుడు నర్తన్ (‘మఫ్టీ’ ఫేమ్)తో రామ్‌చరణ్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. నేవీ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ కథ సాగుతుందని, ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని వినూత్న కథాంశమిదని ప్రచారం జరుగుతున్నది.
కథలోని కొత్తదనంతో పాటు హీరో పాత్రను డిజైన్ చేసిన విధానం నచ్చడంతో రామ్‌చరణ్ ఈ సినిమాకు వెంటనే అంగీకారం తెలిపారని అంటున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు రామ్‌చరణ్. దీని తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.