Prabhas | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాయం అని ఎవరైన వస్తే.. వాళ్లకి ముందుండి నిలబడతాడు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన వరదలు, తుఫాన్ బాధితులకు తానున్నాను అంటూ అండగా నిలిచాడు. అయితే తాజాగా కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు (Wayanad landslides) విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక వయనాడ్ విలయంపై పలువురు సినీ తారలు స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన వంతు సాయంగా రూ. 2 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. అయితే ప్రభాస్ రూ.2 కోట్లు విరాళం ప్రకటించడంపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ప్రభాస్ గురించి ఈ విషయంతో మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ఒక పాఠశాలలో ప్రతియేటా 100 పిల్లలను చదివిపిస్తున్నట్లు.. ఆ 100 మంది పిల్లలకు ప్రభాసే దగ్గరుండి స్కూల్ ఫీజుతో పాటు, బట్టలు దగ్గర నుంచి పిల్లలకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇంత సహాయం చేస్తూ కూడా దాన్ని పబ్లిసిటీ చేసుకోకుండా ఉంటున్నాడు. అతడికంటే ఇంకా గొప్పవారు ఎవరు ఉంటారు అంటూ తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ చదివిపిస్తున్న పిల్లలు హైదరాబాద్‌లో చదువుకుంటున్నట్లు కొంతమంది తెలుపుతుండగా.. మరికొంతమంది.. భీమవరం అని కామెంట్లు పెడుతున్నారు.
Also Read..
Watch: పోలీస్ స్టేషన్లో మహిళను కొట్టిన బీజేపీ నేత.. వీడియో వైరల్
Rahul Gandhi | వయనాడ్ విపత్తును నేషనల్ డిజాస్టర్‌గా ప్రకటించాలి.. లోక్‌సభలో రాహుల్ గాంధీ