Rahul Gandhi | వయనాడ్ విపత్తును నేషనల్ డిజాస్టర్‌గా ప్రకటించాలి.. లోక్‌సభలో రాహుల్ గాంధీ
Rahul Gandhi | కేరళ వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విపత్తుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని.. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Rahul Gandhi | కేరళ వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన విపత్తుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని.. పరిహారం పెంచాలని, సమగ్ర పునరావాస ప్యాకేజీని ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జీరో అవర్‌లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వయనాడ్ విపత్తు అంశాన్ని ప్రస్తావించారు. వయనాడ్‌లో బాధితులను ఆదుకునేందుకు వివిధ వర్గాలు ముందుకురావడం హర్షణీయమన్నారు. ఇటీవల తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వనయాడ్‌లో పర్యటించామమన్నారు. భయంకరమైన విధ్వంసాన్ని, జనాల బాధలను కళ్లారా చూశానన్నారు. కొండచరియలు విరిగిపడి రెండుకిలోమీటర్ల వరకు రాళ్ల కుప్పలు ఉన్నాయన్నారు.
విపత్తులో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని.. పెద్ద సంఖ్యలో జనం గల్లంతయ్యారన్నారు. సంఘటనా స్థలంలో సేవలందిస్తున్న రెస్క్యూ సిబ్బందిని అభినందించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు అందిస్తున్న సహాయాన్ని సహాయన్ని సైతం ప్రశంసించారు. కొండచరియలు విరిగిపడడంతో ప్రధాన రహదారి తెగిపోయిందని.. దాంతో ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడంలో రెస్క్యూ బృందాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్నారు. అయితే ఈ విపత్తులో చాలా సందర్భాలలో కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ప్రాణాలతో బయటపడడం చాలా బాధాకరమన్నారు. వాయనాడ్ ప్రజల సమస్యను లేవనెత్తినందుకు సభకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also :
-
Rajya Sabha Elections | 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు.. తెలంగాణలో ఒక స్థానానికి పోలింగ్
-
Akhilesh Yadav: వినేశ్ పోగట్‌పై అనర్హత.. దర్యాప్తుకు అఖిలేశ్ డిమాండ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

