ముంబై: ఒక బీజేపీ నేత ఏకంగా పోలీస్ స్టేషన్లో మహిళపై దాడి చేశాడు. నేరుగా ఆమె వద్దకు వెళ్లిన ఆయన తొలుత చెంపపై కొట్టాడు. (BJP Leader Beats Up Woman) ఆ తర్వాత ఆమెను కొట్టడం కొనసాగించగా అక్కడున్న పోలీసులు, ఇతరులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని బుల్దానాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఒక జంట పోలీస్ స్టేషన్‌లోని బెంచ్ మీద కూర్చొని ఉన్నారు. ఇంతలో స్థానిక బీజేపీ నేత, మల్కాపూర్ వ్యవసాయ కమిటీ చైర్మన్ శివ తైడే ఆ మహిళ వద్దకు వచ్చాడు. తొలుత ఆమె చెంపపై కొట్టాడు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి కొట్టడం కొనసాగించాడు.
కాగా, పోలీసు అధికారులు, మరో మహిళ బీజేపీ నేత శివను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం పోలీస్ స్టేషన్ అధికారి వద్దకు వారిద్దరూ వెళ్లారు. ఆ మహిళపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ బీజేపీ నేత అనంతరం కుర్చీ నుంచి లేచి వెళ్లిపోయారు. అయితే బీజేపీ నేత శివ, ఆ భార్యాభర్తలు పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లారో అన్నది తెలియలేదు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శివసేన (యూబీటీ) అధికార ప్రతినిధి సుష్మా అంధారే ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే ఒక మహిళను బీజేపీ నేత శివ కొట్టడంపై మండిపడ్డారు. మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆమె దుయ్యబట్టారు.
भाजपचा स्थानिक पुढारी तथा मलकापूर जी बुलढाण्याचे कृषी उत्पन्न बाजार समितीचा सभापती शिवा तायडे या गावगुंडाकडून शहरातील पोलीस स्टेशन मध्येच महिलेला मारहाण.
थोर ते गृहमंत्री.. थोर ते पोलीस कर्मचारी @Dev_Fadnavis @supriya_sule @AdvYashomatiINC @AUThackeray @ShivSenaUBT_ pic.twitter.com/CGAEEDl5zs— SushmaTai Andhare (@andharesushama) August 7, 2024