‘సామజవరగమన’ చిత్రం ద్వారా హిట్ పెయిర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించారు శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్. ఇప్పుడీ జంట ‘మృత్యుంజయ్’ చిత్రంతో మరోమారు వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. శనివారం ఈ సినిమా నుంచి కథానాయిక రెబా మోనికా జాన్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు.
ఈ సినిమా ఆమె ఐపీఎస్ సీతా పరశురామ్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది. కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, పర్ఫార్మెన్స్ ప్రధానంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్నందిస్తున్నారు. సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మాతలు.