Mass Jathara | మాస్ మహారాజా రవితేజ ఇటీవల కాలంలో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ‘ధమాకా’ తర్వాత ఆయనకు పెద్ద హిట్ దక్కలేదు. గతేడాది విడుదలైన ఈగల్, మిస్టర్ బచ్చన్ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. ఈ నేపథ్యంలో, రవితేజ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’.
ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరూ గతంలో ‘ధమాకా’తో ప్రేక్షకులను విశేషంగా అలరించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మనదే ఇదంతా’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా.. ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
t’s an official declaration of a 𝙈𝘼𝙎𝙎 𝙀𝙉𝙏𝙀𝙍𝙏𝘼𝙄𝙉𝙄𝙉𝙂 𝘽𝙊𝙉𝘼𝙉𝙕𝘼 this festive season 🔥
Mass Maharaaj @RaviTeja_offl is bringing a Full On Cracker of a show this Ganesh Chaturthi – AUGUST 27th 💥💥
ఈసారి పండక్కి సౌండ్ మామూలగుండదు….🥁🥁#MassJatharaOnAug27th… pic.twitter.com/AVCNxtyafc
— Naga Vamsi (@vamsi84) May 29, 2025
ఈ సినిమాలో రవితేజ క్లాసిక్ పాటలలో ఒకటైన ఇడియట్ సినిమాలోని చూపులతో గుచ్చి గుచ్చి చంపకే పాటను ఇందులో రీమిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇక టైటిల్‌కు తగినట్లుగానే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందని చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్నందిస్తున్నారు.