raviteja Khiladi | ‘ఒకే పోలికలతో ఉన్న ఇద్దరు యువకుల కథ ఇది. జీవితంలో డబ్బు ముఖ్యమా? అనుబంధాలు, ఆప్యాయతలు విలువైనవా? అనే సత్యాన్ని అన్వేషిస్తూ వారి సాగించిన ప్రయాణంలో ఎవరూ గెలిచారో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు రవితేజ.ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ‘ప్లే స్మార్ట్’ ఉపశీర్షిక. రమేష్ వర్మ దర్శకుడు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మీనాక్షిచౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. 2022 ఫిబ్రవరి 11న ఈ సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను విడుదలచేశారు.
నిర్మాత మాట్లాడుతూ ‘వినూత్నమైన పాయింట్‌తో తెరకెక్కుతున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. రవితేజ పాత్ర రెండు భిన్న కోణాల్లో సాగుతుంది. ఆయన శైలి హంగులన్నీ సినిమాలో ఉంటాయి. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. ఇటీవల విడుదలచేసిన రెండు పాటలకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని తెలిపారు. అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు, సుజిత్ వాసుదేవ్, సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గదా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Raviteja Remuneration | రవితేజ వరుస సినిమాలు..హాట్ టాపిక్‌గా రెమ్యునరేషన్..!
mega154 | చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో?
Ravi Teja | ఇద్దరు హీరోయిన్లతో దుబాయ్‌కు రవితేజ..!
Mahadhan: రవితేజ తనయుడితో హరీష్ శంకర్.. సినిమా మొదలు పెట్టాడా ఏంటి?