Raviteja | సినీ పరిశ్రమకి వారసుల తాకిడి కొత్తేమి కాదు. ఇప్పటికే సినీ పరిశ్రమకి చెందిన హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు ఇండస్ట్రీకి వచ్చి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మాస్ మహరాజా రవితేజ కూతురు కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే తన కొడుకు మహాధన్ ను తన సూపర్ హిట్ ఫిలిం రాజా ది గ్రేట్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రవితేజ ఇప్పుడు కూతురిని కూడా పరిచయం చేయబోతున్నారు. మహాధన్ హీరోగా ఎప్పుడు లాంచ్ అవుతారని మాస్ మహారాజ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అందింది.
రవితేజ కూతురు మోక్షద భూపతిరాజు త్వరలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె నటిగా ప్రేక్షకులను అలరించడం లేదు కాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేయనున్నట్టు సమాచారం. 22 ఏళ్ళు ఉన్న మోక్షద భూపతిరాజు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్ స్ బ్యానర్లో ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఒక అన్ టైటిల్ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తున్నారంట. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించనున్నాడట. అలానే మూవీకి వినోద్ అనంతోజు దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు.
నటిగా కాకుండా తెర వెనక ఉండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ముఖ్య పాత్ర పోషించడానికి మోక్షద ప్రయత్నాలు చేస్తుందని తెలిసి రవితేజ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే రవితేజ తన సొంత బ్యానర్ ఆర్టీ టీమ్ వర్క్స్ లో పలు సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గట్ట కుస్తీ, రావణాసుర, చాంగురే బంగారు రాజా, సుందరం మాస్టర్.. వంటి సినిమాలను నిర్మించడం మనం చూశాం.. అయితే ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మోక్షద అనుభవం సంపాదిస్తుండడంతో రాబోయే రోజులలో రవితేజ కూతురు ఆ బ్యానర్ లో నిర్మించబోయే సినిమాలను దగ్గరుండి చూసుకుంటుందేమో అని ముచ్చటించుకుంటున్నారు.