Raviteja 75 Movie | ‘రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి’.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో రవితేజ కొత్త సినిమా
Raviteja 75 Movie | ఒకవైపు మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తూనే మరోవైపు తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ను లాంచ్ చేశాడు మాస్ మహారాజ రవితేజ (raviteja). తాజాగా రవితేజ 75వ సినిమాని నేడు ఉగాది సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘సామజవరగమన’ రచయిత భాను బొగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Raviteja 75 Movie | ఒకవైపు మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తూనే మరోవైపు తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్ను లాంచ్ చేశాడు మాస్ మహారాజ రవితేజ (raviteja). తాజాగా రవితేజ 75వ సినిమాని నేడు ఉగాది సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘సామజవరగమన’ రచయిత భాను బొగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ‘RT75’ పేరుతో తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్ గమనిస్తే.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో రానున్నట్లు తెలుస్తుంది. హ్యాపీ ఉగాది రా భయ్.. రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ పోస్టర్ మీదా రాసుకోచ్చారు.
పేరు “లక్ష్మణ భేరి.. “ఆదాయం: చెప్పను తియ్.. ఖర్చు: లెక్క జెయ్యన్.. రాజ్యపూజ్యం: అన్ లిమిటెడ్.. అవమానం: జీరో అంటూ రవితేజ పాత్రను రివీల్ చేశారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 2025లో ఈ సినిమా రానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
అందరికి హ్యాపీ ఉగాది రా భయ్ 😎
We are elated to announce our next with the 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐉𝐀 @RaviTeja_offl ~ #RT75, Shoot Begins Soon! 🔥
వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు… రెడీ అయిపొండ్రి 🥳
We promise to bring back the typical Mass Maharaja on Big screens… pic.twitter.com/W7Q2Jdn6zO
— Sithara Entertainments (@SitharaEnts) April 9, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

