వెరైటీ టైటిల్స్ రవితేజకు కొత్తేంకాదు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ఇలా చెప్పుకుంటూ పోతే వెరైటీ టైటిల్స్ చాలానే తగుల్తాయి. త్వరలో మరో విభిన్నమైన టైటిల్‌తో మాస్మహారాజా రాబోతున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్. ప్రస్తుతం రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో ఆయన ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.
జూలైలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్యలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా తర్వాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్‌ని ఖరారు చేశారట. ఈ పేరు వినగానే సినిమాపై ఆడియన్స్‌కి ఆసక్తి మొదలైంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ కథానాయిక.