కథను గుడిలా భావిస్తా
రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు శరత్ మండవ. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు శరత్ మండవ.
ఈ సినిమాలో కథానాయకుడు చేయబోయే డ్యూటీ ఏంటి?
ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ. సాధారణంగా ఒక మిస్సింగ్ కేసును పోలీసులు విచారణ చేస్తుంటారు. కానీ ప్రభుత్వ అధికారి రామారావు ఈ కేసును ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేది కథలో కొత్తగా ఉండే అంశం.
సమాజంలోని ఏ సమస్యలను కథలో ప్రస్తావించారు?
కలెక్టరేట్‌తో ముడిపడి ఉండే సమస్యలన్నీ ఈ కథలో వస్తుంటాయి. అందులో ఇసుక మాఫియా కూడా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కలెక్టర్లు ఆదేశాలు ఇస్తుంటారు. అలాంటి అంశాలను కథలో ఉపయోగించాం. నేను చూసిన కొన్ని ఘటనల స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నా.
‘రామారావు ఆన్ డ్యూటీ’ టైటిల్ వెనక కసరత్తు ఏంటి?
రామారావు అనేది తెలుగులో ప్రసిద్ధమైన పేరు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తెలంగాణ లీడర్ కేటీఆర్. ఇలా వీళ్ల పేర్లన్నీ రామారావు కదా. ఈ పేరులోనే స్ఫూర్తి ఉంది. అందుకే టైటిల్‌గా పెట్టాం.
రవితేజ అంటే వినోదం కోరుకుంటారు, ఈ ట్రైలర్ చూస్తే పూర్తి యాక్షన్‌తో ఉంది
వినోదం అంటే కేవలం కామెడీ అని అనుకోను. ప్రేక్షకులను కథలో లీనం చేసే ఏ అంశమైనా ఎంటర్టైన్మెంట్ కిందకే వస్తుంది. రవితేజ గత చిత్రాలు గుర్తుకురాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నాం. కథ కొత్తగా ఉంటుంది.
కథ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి?
నా వరకు కథ ఒక గుడి లాంటిది. ఆ కథను వదిలి పక్కకు వెళ్లను. ఆ కథకో నిర్మాణం ఉంటుంది. కథ రాసేప్పుడు దానికి కావాల్సినవి అదే సమకూర్చుకుంటుంది అని దర్శకరత్న దాసరి చెప్పిన మాటలను గుర్తుపెట్టుకుంటాను. జయాపజయాలు మన చేతిలో ఉండవు. మంచీ చెడు మాత్రమే ఉంటాయి.
వేణు తొట్టెంపూడి పాత్ర ఎలా ఉంటుంది?
ఈ సినిమాలో కీలకమైన సీఐ పాత్ర ఒకటి ఉంది. ఆ పాత్ర కోసం ఎవర్ని తీసుకుందాం అనుకునేప్పుడు వేణు గుర్తొచ్చారు. ఆయన చిరునవ్వుతో సినిమా ఎంతో బాగుంటుంది. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ వస్తుంటాయి. ఆయనకు ఈ కథ చెప్పగానే ఒప్పుకున్నారు. వేణు క్యారెక్టర్ ఆసక్తికరంగా ఉంటుంది.
ఇకపై ఎలాంటి చిత్రాలు చేయాలని ఉంది?
నాకు ఫీల్ గుడ్ చిత్రాలు చేయడం రాదు. శేఖర్ కమ్ముల తరహా సినిమాలు చేయలేను. యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలు రూపొందించగలను. రాజూ హిరాణీ తరహా చిత్రాలు తెరకెక్కించాలని ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

