రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ ఉపశీర్షిక. భాను భోగవరపు దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. శ్రీలీల కథానాయిక. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని,
వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులు కలబోసిన పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ ఇదని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: విధు అయ్యన్న, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: భాను భోగవరపు.