Mass Jathara | మాస్ మహారాజ కథానాయకుడు రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara). శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగష్టు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రయూనిట్ మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుకొని కారణాల వలన ఈ చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్రబృందం ఎక్స్‌వేదికగా ప్రకటించింది.
నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ‘మాస్ జాతర’ చిత్రం వాయిదా పడినట్లు తెలిపింది. పరిశ్రమలోని సమ్మెలు, కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా పనులు ఇంకా పూర్తి కాలేదని.. ఈ సినిమా పూర్తయ్యాక భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది.. అలాగే అతి త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. సినిమా ఆలస్యమైనా, ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదం అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రంలో రవితేజ రైల్వే పోలీస్‌గా కనిపించబోతున్నాడు.
Due to recent industry-wide strikes and unforeseen delays in wrapping up crucial content, #MassJathara will not be arriving on its planned date of Aug 27th.
But the team is working relentlessly to bring you the BIGGEST MASS FEAST in theatres soon! ❤️🔥💥
New release date will be… pic.twitter.com/m3d0yCDH38
— Sithara Entertainments (@SitharaEnts) August 26, 2025