రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా కుటుంబ కథా చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించిందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని స్టిల్స్‌ను బుధవారం విడుదల చేశారు. వీటిపై స్పందిస్తూ చిత్ర కథానాయిక ప్రియా భవానీ శంకర్ సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘ఇరుముడి’ సినిమా ప్రయాణం ఓ అందమైన జ్ఞాపకమని, ఇది జీవితాంతం గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేసింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, ఆధ్యాత్మిక అంశాల కలబోతగా ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్ని కదిలిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. బేబీ నక్షత్ర, అజయ్‌ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.