కార్తీక్ రత్నం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఛాంగురే బంగారు రాజా’. రవితేజ స్వీయ నిర్మాణ సంస్థ ఆర్టీ టీమ్ వర్క్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకుడు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘ఓ ఊరిలో మెకానిక్‌గా పనిచేసే బంగారురాజా కథ ఇది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఉత్కంఠను పంచుతుంది.
వినోదానికి పెద్దపీట వేశాం. కార్తీక్ రత్నం పాత్ర కొత్త పంథాలో సాగుతుంది. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. సత్య, రవిబాబు, గోల్డీ నిస్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుందర్ ఎన్.సి, సంగీతం: కృష్ణసౌరభ్, రచన-దర్శకత్వం: సతీష్ వర్మ.