రవితేజ, శివ నిర్వాణ సినిమాకు ‘ఇరుముడి’ అనే టైటిల్ ప్రకటించిన నాటి నుంచీ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దానికి తగ్గట్టు అయ్యప్ప మాలలో ఆయన కనిపించడం, భుజాలపై చిన్నపాప.. చుట్టూ అయ్యప్ప స్వాములు, మంగళవాయిద్యాల, మంగళ తోరణాలు.. ఈ సన్నివేశం చూస్తుంటే ఇదో భావోద్వేగాలతో కూడిన కథ అని తెలుస్తున్నది. వాస్తవానికి కూడా ఈ సినిమా కథ, కథనం, పాత్రల చిత్రణ వైవిధ్యంగా ఉంటాయని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. రెండూ పాత్రలు చేయడం రవితేజకు కొత్తేం కాదు. అయితే.. ఈ పాత్రల్లోని వేరియేషన్స్ మాత్రం చాలా బాగా కుదిరాయని టాక్ వినిపిస్తున్నది. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.