క్రాక్ సినిమా సక్సెస్ తర్వాత ఫుల్ స్పీడుమీదున్నాడు టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రవితేజ త్వరలోనే ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా రవితేజ ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్ ను కొత్తగా ప్రయత్నించాడు రవితేజ.
ధమాకా (Dhamaka Promotions) ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ డైరెక్టర్లు గోపీచంద్ మలినేని, బాబీ, అనిల్ రావిపూడి హీరో రవితేజను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు దర్శకులతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు రవితేజ. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. త్వరలోనే ఈ క్రేజీ ఇంటర్వ్యూ యూట్యూబ్లో ప్రసారం కానుంది. ధమాకా సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచడమే కాదు.. మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ధమాకాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసీ రోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రం హిందీలో కూడా విడుదలవుతుంది.
ముగ్గురు దర్శకులతో రవితేజ స్టిల్..
My blockbuster directors Trio @MeGopiChand, @DirBobby & @AnilRavipudi came together for the first time to interview me!
It was a Dhamakedar interaction about #Dhamaka🤗
Full Interview out tomorrow ✌️#DhamakaFromDec23 pic.twitter.com/xOEQn3aVgD— Ravi Teja (@RaviTeja_offl) December 20, 2022