Ravi Teja | తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకి హైప్ క్రియేట్ చేసే టైటిల్ పెట్టడం చాలా ముఖ్యం. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ తన కొత్త చిత్రం ‘మాస్ జాతర’కి స్వయంగా టైటిల్ సూచించి ఆ టైటిల్‌ను ఫైనల్ చేయించినట్టు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్న భాను భోగవరపు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మొదటిసారి కథ వినగానే రవితేజ సినిమా పట్ల ఎంతో ఉత్సాహం చూపించాడని చెప్పారు. కథలో మాస్ అంశాలు, పాత్ర పవర్ఫుల్ గా ఉండటంతో వెంటనే “మాస్ జాతర” అనే టైటిల్‌ను రవితేజనే సూచించాడట. దర్శకుడికి కూడా టైటిల్ బాగా నచ్చడంతో ఆ టైటిల్‌నే లాక్ చేశారట.
ఇక సినిమా టైటిల్‌కు పెట్టిన “మనదే ఇదంతా” అనే క్యాప్షన్ మాత్రం దర్శకుడు భాను క్రియేటివిటీ పెట్టాడట. మొదట ఈ క్యాప్షన్‌ను రవితేజ తిరస్కరించాడట. అయితే భాను “ఒక్కసారి వేసి చూద్దాం, నచ్చకపోతే తీసేస్తాం” అని చెప్పడంతో రవితేజ అంగీకరించాడట. చివరికి ఆ క్యాప్షన్‌కి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దర్శకుడు తెలిపాడు. ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో తన యాస, భాష, బాడీ లాంగ్వేజ్ అన్నీ కొత్తగా ఉంటాయని తెలిపారు. ప్రేక్షకులకు మరోసారి ఓ పవర్ఫుల్ మాస్ అటిట్యూడ్‌ను చూపించనున్నట్టు వెల్లడించారు.అలానే రవితేజ తన సోషల్ మీడియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్ వీడియోల పట్ల ఆసక్తి చూపించిన ఆయన, ట్విట్టర్‌ని ఏ మాత్రం ఇష్టపడనని స్పష్టం చేశారు. “ఇక్కడ అంతా నెగెటివ్ బ్యాచ్.. అందుకే నేను ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండను” అని తేల్చి చెప్పారు.
మరోవైపు ఓలే ఓలే సాంగ్‌పై కూడా స్పందించారు. ఇందులో నీ అమ్మని, నీ అక్కని.. అంటూ బూతు పదాలు వినిపించడంతో తెగ ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన రవితేజ పాటలోని కొన్ని లైన్స్ విని తప్పుపట్టడం సరికాదు. మొత్తం పాట సినిమాలో చూస్తే ఎందుకు పెట్టామని మీకే అర్ధమవుతుంది. కథ డిమాండ్‌ని బట్టే పాట పెట్టడం జరిగింది అని రవితేజ వివరణ ఇచ్చారు. ఇక ‘మాస్ జాతర’ సినిమా ఈ నెల అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.