Ravi Teja | ఇరుముడి సక్సెస్‌తో ఫుల్ జోష్.. ఆ డైరెక్టర్‌తో రవితేజ కొత్త సినిమా..!
Ravi Teja | ఇరుముడి సక్సెస్ అందుకున్న సందర్భంగా రవితేజకు శుభాకాంక్షలు తెలియజేసిన దిల్ రాజు కొత్త ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించేశారు. ఈ క్రేజీ కాంబో ట్రాక్‌పైకి వచ్చేసింది.
Ravi Teja | టాలీవుడ్ యాక్టర్ రవితేజ ప్రస్తుతం ఇరుముడి సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. రూ.200 కోట్ల మార్కు దిశగా దూసుకెళ్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. కాగా రవితేజ డైరెక్టర్ హసిత్ గోలితో సినిమా చేయబోతున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో ట్రాక్‌పైకి వచ్చేసింది. ఈ ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఫన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇరుముడి సక్సెస్ అందుకున్న సందర్భంగా రవితేజకు శుభాకాంక్షలు తెలియజేసిన దిల్ రాజు.. హసిత్ గోలి ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించేశారు. ఈ చిత్రం 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ మల్టీ స్టారర్‌గా రానుంది. టాలీవుడ్ యాక్టర్ శ్రీవిష్ణు ఈ చిత్రలో మరో లీడ్ రోల్లో నటించబోతున్నాడన్న వార్తల ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. SVC64గా రానున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు నటిస్తున్నాడనే అప్డేట్పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
రాజరాజ చోర, స్వాగ్ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి బ్రేక్ అందుకున్నాడు హసిత్ గోలి. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ రవితేజతో ఎలాంటి స్టోరీ తీయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
Read Also :
East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు
Konda Surekha | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు.. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

