అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Medak | నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి గ్రామంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో 90 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టారు.
మెదక్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి గ్రామంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో 90 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం చేపట్టారు. ఈ సందర్భంగా సరైన వాహన పత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు, రెండు బొలెరోలు, నాలుగు ఆటోలను కలిపి మొత్తం 75 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల్లో భాగంగా నార్కోటిక్ డాగ్ జూబి సహాయంతో ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల ఉనికిని పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్ డివైజ్‌తో వేలిముద్రలను సేకరించి పాత నేరస్థుల వివరాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంకు ఖాతాల వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. చిన్న దూరమైనా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, స్ట్రాప్ బిగించుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లలోపు బాలికతో ఆమె అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నా పోక్సో చట్టం ప్రకారం నేరమేనని, నిందితులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించడం తమ ఉద్దేశం కాదని, వారి భద్రత, నేరాల నియంత్రణ కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అదనపు ఎస్పీ తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామస్థులకు అందుబాటులో ఉండేందుకు వీఓపీ ఏఎస్ఐ విఠల్‌ను నియమించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అవుసులపల్లిలో పోలీసుల విస్తృత తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

