Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
Ramayana | నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామాయణ' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది.
Ramayana | నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. విడుదలైన రెండో రోజు వర్కింగ్ డే కావడంతో తొలి రోజుతో పోలిస్తే కొద్దిగా తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల మార్క్‌ను విజయవంతంగా దాటింది. దీంతో వీకెండ్ ముగిసేసరికి రూ. 500 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రణ్‌బీర్ కపూర్, యష్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ కేవలం రెండు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.
ఈ సినిమా శుక్రవారం నాడు రూ. 48.05 కోట్ల నెట్ వసూలు చేయగా, ఓవర్సీస్లో రూ. 35 కోట్లు రాబట్టింది. దీంతో తొలి రెండు రోజుల్లో దీని ప్రపంచవ్యాప్త గ్రాస్ కలెక్షన్లు రూ. 221.05 కోట్లకు చేరుకున్నాయి. ‘పఠాన్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప 2’, ‘జైలర్ 2’, ‘ధురంధర్ 2’ వంటి చిత్రాల సరసన ఈ సినిమా కూడా రెండు రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రాల జాబితాలో చేరింది.
భారతీయ మార్కెట్లో ఈ చిత్రానికి ప్రధాన వసూళ్లు హిందీ వెర్షన్ నుంచే వస్తున్నాయి. కేవలం శుక్రవారం రోజే హిందీలో 19,859 షోల ద్వారా రూ. 35.50 కోట్ల నెట్ వసూలయ్యాయి. ఇక కన్నడ వెర్షన్ ద్వారా రూ. 5.15 కోట్లు, తెలుగులో రూ. 4.75 కోట్లు, తమిళంలో రూ. 1.50 కోట్లు, మలయాళంలో 446 షోల ద్వారా రూ. 1.15 కోట్లు రాబట్టింది. మొదటి రెండు రోజుల్లో ‘రామాయణ: పార్ట్ 1’ భారతదేశంలో రూ. 134.80 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, నెట్ కలెక్షన్లు రూ. 112.90 కోట్లకు చేరాయి.
అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన ఈ చిత్రానికి విదేశాల్లోనూ భారీ స్పందన లభిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఓవర్సీస్లో ఈ సినిమా రూ. 86.25 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. దీపావళికి ముందే సినిమా విడుదల కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనలను ఈ చిత్రం పటాపంచలు చేసింది. పండుగ రోజుల్లో కుటుంబాలు పూజలు ముగించుకుని థియేటర్ల బాట పట్టే అవకాశం ఉండటంతో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉంది.
నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, రవి దూబే లక్ష్మణుడిగా, యష్ రావణాసురుడిగా నటించారు. అలాగే లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, సౌరభ్ సచ్‌దేవా, అరుణ్ గోవిల్, అనుపమ్ ఖేర్, సన్నీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 5న ఘనంగా విడుదలయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ సునామీ.. రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు!
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

