King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
King | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘కింగ్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పఠాన్’, ‘జవాన్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమాపై అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు.
King | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘కింగ్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పఠాన్’, ‘జవాన్’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత షారుఖ్ నుంచి వస్తున్న మరో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమాపై అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 24, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ‘కింగ్’ సినిమాకు సంబంధించిన తెలుగు స్టాండీ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. థియేటర్లకు పంపించిన ఈ స్టాండీలపై తెలుగు అక్షరాలు కనిపించడంతో ఈ సినిమా తెలుగులోనూ విడుదల కాబోతుందా? అనే చర్చ మొదలైంది.
ఇప్పటివరకు చిత్రబృందం తెలుగు వెర్షన్ విడుదలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే థియేటర్లకు తెలుగు ప్రచార సామగ్రి చేరడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షారుఖ్ ఖాన్ గత చిత్రాలైన ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు తెలుగులోనూ విడుదలై ఇక్కడి ప్రేక్షకులను అలరించాయి. అయితే ‘డంకీ’ మాత్రం తెలుగు వెర్షన్లో విడుదల కాలేదు. ఇప్పుడు ‘కింగ్’ కూడా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తే ఆయన అభిమానులకు మరో భారీ సినిమా చూసే అవకాశం దక్కుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘తూ మిల్ జాయే’ పాట ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. తొలుత ఈ పాటపై కొంత విమర్శలు వచ్చినప్పటికీ, ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. సినిమాపై ఉన్న అంచనాలను ఈ పాట మరింత పెంచింది.
ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొణె, అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, జైదీప్ అహ్లావత్, అర్షద్ వార్సీ, రాఘవ్ జుయల్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే కరీనా కపూర్ ప్రత్యేక గీతంలో కనిపించనున్నట్లు సమాచారం. ‘వార్ 2’, ‘పఠాన్’ వంటి భారీ యాక్షన్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో షారుఖ్ ఖాన్ కొత్త అవతారంలో కనిపించనున్నారు. భారీ తారాగణం, యాక్షన్ సన్నివేశాలు, ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | తెలుగులోనూ షారుఖ్ ఖాన్ ‘కింగ్’.. థియేటర్లలో ప్రత్యక్షమైన తెలుగు స్టాండీలు,ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
Kaala Bhairava | కీరవాణి ఇంట పెళ్లి సందడి.. హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో కాలభైరవ నిశ్చితార్థం!
Dada | బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ‘దాదా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు,ఎప్పుడంటే?
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

