సాయిరామ్‌శంకర్, ఆశీమా నర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విజయన్ దర్శకుడు. వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం ఈ చిత్ర టీజర్‌ను రవితేజ విడుదల చేశారు. ‘ఈ సినిమాలో హీరో సాయిరామ్‌శంకర్ రామరావణ తరహాలో రెండు భిన్న వైరుధ్యాలున్న పాత్రలో కనిపిస్తారు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించాం. ఈ సినిమా కోసం ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ నెల 24న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. శృతిసోధి, సముద్రఖని, కళాభవన్ మణి, రవి పచ్చముత్తు, భానుశ్రీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాహుల్‌రాజ్, నిర్మాతలు: వినోద్ విజయన్, రవి పచ్చముత్తు, గార్లపాటి రమేష్, దర్శకుడు: వినోద్ విజయన్.